పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణపై కీలక నిర్ణయాలు – మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి

ప్రజాసంక్షేమం న్యూస్ పాలిటెక్నిక్ కళాశాలల ఆధునికీకరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారు తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలను సాంకేతిక కేంద్రాలుగా మార్చేందుకు ₹8 వేల కోట్లతో ప్రతిపాదనలు చేసినట్లు,ఉద్యోగావకాశాలు పెంచేందుకు పాలిటెక్నిక్ కళాశాలలు స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకువచ్చినట్లు దీనిద్వారా ఈ కోర్సులకు AICTE గుర్తింపు ఉంటుందని ఫీజులలో ఎటువంటి పెంపు ఉండదని.భూములను విక్రయించబోమని, 282 ఎకరాలు విద్యకే కేటాయించామని ప్రైవేటీకరణ వార్తలు అబద్ధంమని ECET ద్వారా నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరే అవకాశం యథాతథంగా ఉంటుందని తెలిపారు.