PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 9:47 am Posted by : Praja Sankshemam News

పెద్దకాపర్తి బీసీ హాస్టల్‌లో హ్యాపీనెస్ కోర్స్ ప్రారంభం

యోగ, ధ్యానంతో విద్యార్థుల్లో ఏకాగ్రత.. ఆత్మవిశ్వాసం పెంపు
చిట్యాల రూరల్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):

ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని బీసీ హాస్టల్‌లో విద్యార్థులకు హ్యాపీనెస్ కోర్స్ సోమవారం ప్రారంభమైంది.ఈ సందర్భంగా విద్యార్థులకు యోగ,ధ్యానం తదితర సాధనలను నిర్వహించారు.కార్యక్రమాన్ని సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు, పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ప్రారంభించారు. విద్యార్థుల్లో శారీరక, మానసిక శక్తి సామర్థ్యాలను పెంపొందించడంతో పాటు ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం,సానుకూల ఆలోచనా విధానాన్ని పెంచేలా యోగ, ధ్యానం,పద్మ సాధనలు, త్రీ స్టేజ్ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు, భస్త్రిక తదితర సాధనలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్, టీచర్ పల్లపు బుద్ధుడు మాట్లాడుతూ ధ్యానం మానవ జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రక్రియ అన్నారు. ప్రతి విద్యార్థి తమ నిత్యజీవితంలో యోగ, ధ్యానాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ సూచించిన సుదర్శన్ క్రియ ద్వారా అంతర్గత శక్తిని గుర్తించి మానసిక ప్రశాంతత పొందవచ్చని తెలిపారు.ప్రతిరోజూ కనీసం పది నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనశ్శాంతి, సానుకూల శక్తి, మానసిక ప్రశాంతత పొందవచ్చని పేర్కొన్నారు. శాంతియుత సమాజం, వసుధైవ కుటుంబం కోసం ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ధర్మపురి తార, ట్యూటర్ బాలు, విద్యార్థులు పాల్గొన్నారు.