ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణకు ప్రత్యేక స్థానం కల్పించాలి

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజా సంక్షేమం న్యూస్ | హైదరాబాద్ తెలంగాణను జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో పర్యాటక, సాంస్కృతిక శాఖలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పర్యాటక ప్రాజెక్టులు,శాఖ ఆస్తులు,ప్రైవేట్ పెట్టుబడులు, చారిత్రక కట్టడాల పరిరక్షణ,పర్యాటక బ్రాండింగ్ తదితర అంశాలపై చర్చించారు....