PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:39 pm Posted by : Praja Sankshemam News

ఫామ్‌హౌస్‌లపై కాంగ్రెస్‌ ఫోకస్‌.. అజీజ్‌నగర్, మొయినాబాద్‌లో ప్రజాప్రతినిధుల పర్యటన!

అసైన్డ్‌ భూముల్లో నిర్మాణాలపై ప్రశ్నలు.. 111 జీవో ఉల్లంఘనలపై కాంగ్రెస్‌ నేతల ఆరోపణలు!
ప్రజాసంక్షేమం న్యూస్ అజీజ్‌నగర్/మొయినాబాద్:

బీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధించిన ఫామ్‌హౌస్‌ల నిర్మాణాలను ప్రజలకు చూపించేందుకు కాంగ్రెస్‌ ఎంపీలు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులతో కలిసి అజీజ్‌నగర్‌,మొయినాబాద్‌ ప్రాంతాల్లో పర్యటించినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు.ఈ సందర్భంగా పరిగి ఎమ్మెల్యే డాక్టర్‌ టీ.రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.“అజీజ్‌నగర్‌లోని ఫామ్‌హౌస్‌ అసైన్డ్‌ భూమిలో,111 జీవో పరిధిలో ఉందని” ఆరోపించారు. అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ నిర్మించుకునే అధికారం పైలట్‌ రోహిత్‌రెడ్డికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు.తెలంగాణలో ఫామ్‌హౌస్‌ల సంస్కృతిని బీఆర్‌ఎస్‌ నేతలు తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. కేటీఆర్‌ ఒక సందర్భంలో తాము ఆగర్భ శ్రీమంతులమని చెప్పడం,మరో సందర్భంలో హైదరాబాద్‌లో తనకు,తన తండ్రికి ఇల్లు లేదని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలుగా ఉన్నాయని రామ్మోహన్‌రెడ్డి అన్నారు.
అలాగే,పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించి గతంలో పోలీసులు కేసు నమోదు చేసిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. 2026 మార్చిలో మొయినాబాద్‌లోని ఆ ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీపై పోలీసులు దాడి చేసినట్లు పలు వార్తా సంస్థలు నివేదించాయి.
అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ నిర్మాణంపై రెవెన్యూ అధికారులు గతంలో సర్వే నిర్వహించి,అజీజ్‌నగర్‌లోని సర్వే నంబర్‌ 177/33లో 2 ఎకరాల 20 సెంట్ల భూమిని అసైన్డ్‌ భూమిగా గుర్తించినట్లు వార్తా నివేదికలు చెబుతున్నాయి.