PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:16 am Posted by : Praja Sankshemam News

ఫీజ్ రియాంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి:DSP జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల కుమార్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ(DSP)ధర్నా…
ప్రజా సంక్షేమం న్యూస్-యాదాద్రి భువనగిరి

ఫీజ్ రియాంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎర్రోళ్ల శాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో జిల్లా కొంద్రంలొని రైతు బజార్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BC SC ST JAC రాష్ట్ర ఉపాధ్యక్షులు రాసాల వినోద్ యాదవ్ గారు పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులకు దాదాపు రూ.14 వేల కోట్ల ఫిజ్ రియాంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఫిజ్ రియాంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల బిసి,ఎస్సి,ఎస్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతొ కష్టపడి వారి పిల్లలను చదివిస్తున్నారని తెలిపారు. కళాశాలల యాజమాన్యం ఫిజులు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులను వీధిస్తున్నారని, ఫిజులు కట్టలేక దిక్కు తోచని స్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని అన్నారు.వెంటనే ఫిజు రియాంబర్స్మెంట్ బకాయిలని చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిసి,ఎస్సి,ఎస్టీ-జేఏసి, ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ యాదవ్, లింగస్వామి, మహేష్, జాలేందర్, ప్రధాన కార్యదర్శి వెలువర్తి శ్రీకాంత్, జిల్లా కార్యదర్శులు సురేష్, సాయి కుమార్, సాయి కిరణ్, నాయకులు నరెష్, సందీప్, నాగేష్, నరేందర్, నవీన్, వెంకటేష్, కిరణ్ ముదిరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.