PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 10:37 am Posted by : Praja Sankshemam News

బీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ – ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్

ప్రజాసంక్షేమం న్యూస్ – హైదరాబాద్
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాల పార్టీ, ఆ పార్టీకి ఆల్ ఇండియా అబద్ధాల నాయకుడు కేటీఆర్ అని తీవ్రంగా విమర్శించారు.అమెరికా నుంచి వచ్చిన ఆల్ ఇండియా లీడర్ కేటీఆర్,మీడియాలో వచ్చిన వార్తలను,బయటకు వచ్చిన ఆధారాలను కూడా ఆర్టిఫిషియల్ ఫోటోలు,మార్ఫింగ్ ఫోటోలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.కేటీఆర్,హరీష్ రావులకు అసెంబ్లీ రూల్స్ తెలియవా? తెలిసి కూడా పోలీసులపై దాడికి పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.22-A భూముల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో చర్చలో పాల్గొనకుండా ఎందుకు పారిపోయారని కేటీఆర్ ను ప్రశ్నించారు.గత పదేళ్ల పాలనలో భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, కేటీఆర్, ఆయన బంధువులు భూములను దోచుకున్నారని ఆరోపించారు. లాజిస్టిక్స్ పార్క్ పేరుతో వందల ఎకరాలను మింగేశారని అన్నారు.గత పదేళ్లు మీరు చేసింది భూ దోపిడీ, విధ్వంసం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు.మీది భూ దోపిడీ, విధ్వంసం..మాది ప్రజా సంక్షేమం,అభివృద్ధి అని అన్నారు.