PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 4:02 pm Posted by : Praja Sankshemam News

బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదు.. అందుకే మహిళా కమిషన్ డ్రామాలు – ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్

ప్రజాసంక్షేమం న్యూస్ – హైదరాబాద్
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల పూర్తి ఆశీర్వాదం ఉందని స్పష్టంగా తేలింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉన్నారని ఈ సర్వే మరోసారి స్పష్టం చేసింది.ప్రజల్లో బీఆర్ఎస్ కు ఆదరణ లేదనే విషయం తేటతెల్లం కావడంతో ఆ పార్టీ నాయకులు దిక్కుతోచని పరిస్థితుల్లో మహిళా కమిషన్ ను ఆశ్రయించే స్థాయికి దిగజారారని ఎద్దేవా చేశారు.మహిళల పట్ల బీఆర్ఎస్ కు ఎంత గౌరవం ఉందో వారి సొంత చెల్లి కవిత గారే గతంలో చెప్పారు. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు ఉందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు.
అసెంబ్లీలో 22-A అంశంపై చర్చ జరుగుతుంటే బాధ్యతగా సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్న బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ దళిత సమాజాన్ని అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ దే. ఆనాడు డిప్యూటీ సీఎం రాజయ్య గారిని, కొప్పుల ఈశ్వర్ గారిని అవమానించిన తీరును తెలంగాణ సమాజం ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు.దళితులు, మహిళలు, బలహీన వర్గాల పట్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాలను ప్రజలు గమనించారు. అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టారు.”ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ కే ఉంది.. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్ తోనే ఉంది. బీఆర్ఎస్ ఎన్ని రాజకీయ డ్రామాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుంది” అని వేముల వీరేశం గారు స్పష్టం చేశారు.