బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ లేదు.. అందుకే మహిళా కమిషన్ డ్రామాలు – ప్రభుత్వ విప్ వేముల వీరేశం ఫైర్
ప్రజాసంక్షేమం న్యూస్ - హైదరాబాద్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల పూర్తి ఆశీర్వాదం ఉందని స్పష్టంగా తేలింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉన్నారని ఈ సర్వే మరోసారి స్పష్టం చేసింది.ప్రజల్లో బీఆర్ఎస్ కు ఆదరణ లేదనే విషయం తేటతెల్లం కావడంతో...