PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 10:56 pm Posted by : Praja Sankshemam News

బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వారికి తగిన వాటా,రిజర్వేషన్లు,హక్కులు కల్పించాలి:మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజాసంక్షేమం న్యూస్
బీసీలకు సంబంధించిన కీలక చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీ ఫ్లోర్ లీడర్,బీసీ నాయకులు తమ వైఖరిని స్పష్టంగా చెప్పాలి.బీజేపీ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటూనే, బీసీల జనాభాను లెక్కించడానికి ఎందుకు వెనుకడుగు వేస్తోంది? 2027 జనగణనలో బీసీల కుల గణనను తప్పనిసరిగా చేర్చాలి.బీసీల జనాభా లెక్కలు లేకుండా రిజర్వేషన్లు,సంక్షేమం,రాజకీయ ప్రాతినిధ్యం ఎలా నిర్ణయిస్తారు? తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా బీసీల వివరాలు సేకరించినట్టే దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలి.బీసీలను లెక్కించడానికి ఎందుకు భయం?బీసీలకు న్యాయం జరిగే వరకు అన్ని పార్టీలను కలుపుకొని ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.