బీసీల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఐక్య పోరాటం అవసరం:పొన్నం ప్రభాకర్
2027 జనాభా లెక్కల్లో ఓబీసీ కాలమ్ చేర్చి కులగణన చేపట్టాలి! బీసీల జనాభాకు అనుగుణంగా న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించాలి! 50 శాతం రిజర్వేషన్ పరిమితిపై కేంద్రం పునరాలోచించాలి! ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని జాతీయ ఓబీసీ సదస్సులో డిమాండ్ చేశారు.బీసీల జనాభాను శాస్త్రీయంగా లెక్కించినప్పుడే జనాభా ప్రాతిపదికన వారికి న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.బేగంపేటలోని హోటల్ టూరిజం ప్లాజాలో “ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన...