బీసీ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరాలి:బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
గురుకులాలు, హాస్టళ్లలో నాణ్యమైన విద్య, పౌష్టికాహారంపై ప్రత్యేక దృష్టి! ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ దరఖాస్తులపై సమీక్ష! ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ,విద్యా కార్యక్రమాలపై మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బీసీ మహిళలకు అందిస్తున్న‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం దరఖాస్తుల స్వీకరణ, అమలు తీరుతో పాటు బీసీ గురుకులాలు,హాస్టళ్ల పనితీరు,విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై విస్తృతంగా చర్చించారు.‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’పథకం కింద ఇప్పటివరకు 4.06 లక్షల దరఖాస్తులు అందినట్లు అధికారులు వివరించారు.దరఖాస్తుల...