భక్తిశ్రద్ధలతో.. బాధ్యతతో వినాయక నిమజ్జనం…!
భక్తిశ్రద్ధలతో.. బాధ్యతతో వినాయక నిమజ్జనం ప్రజల భద్రత,పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి మట్టి గణపతులు, కృత్రిమ నిమజ్జన కొలనులను వినియోగించాలి హైదరాబాద్, సెప్టెంబర్ 22: గణేష్ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో పాటు సురక్షితంగా, క్రమశిక్షణతో, పర్యావరణహితంగా నిర్వహించుకోవాలని ప్రజా సంక్షేమం న్యూస్ విజ్ఞప్తి చేసింది.CSF – Community Safety Forum ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజా అవగాహన కార్యక్రమంలో భాగంగా నిమజ్జనానికి సంబంధించి పలు సూచనలు చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రభుత్వం ఏర్పాటు...