PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 2:52 pm Posted by : Praja Sankshemam News

భీమ్ ఆర్మీ మునుగోడు అధ్యక్షుడిగా బొల్గురి ముకేష్.

బహుజన సిద్ధాంతాల ప్రచారమే లక్ష్యం..
హక్కుల పరిరక్షణకు నిరంతరం పోరాటం.
సంస్థ బలోపేతానికి కృషి చేస్తా:ముకేష్
ప్రజాసంక్షేమం న్యూస్-నల్గొండ:
భీమ్ ఆర్మీ (భారత్ ఏక్తా మిషన్) మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడిగా బొల్గురి ముకేష్ నియమితులయ్యారు.బహుజన నాయకుల ఆశయాల సాధన,సామాజిక న్యాయం లక్ష్యంగా సంస్థ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు ఈ నియామకం చేసినట్లు జిల్లా నాయకత్వం తెలిపింది.భీమ్ ఆర్మీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు సమక్షంలో ముకేష్ నూతన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు వంగూరి శ్రీకాంత్‌తో పాటు నాయకులు కొత్తూరు నవీన్, ఎర్రసాని స్వామి, గాదె రాజు, శివ, సాయి, మణికుమార్, హరిబాబు తదితరులు పాల్గొని ముకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వడ్డేపల్లి నాగరాజు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే,ఛత్రపతి షాహూజీ మహారాజ్,డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,మాన్యశ్రీ కాన్షీరామ్‌ల బహుజన సిద్ధాంతాలు,భావజాలాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ముకేష్ తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధి, నిజాయితీతో నిర్వహించి సంస్థ బలోపేతానికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.నూతన అధ్యక్షుడు బొల్గురి ముకేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యత అప్పగించిన జిల్లా నాయకత్వానికి,ముఖ్యంగా వడ్డేపల్లి నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.మునుగోడు నియోజకవర్గంలోని బహుజనులు,వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకు, వారి సమస్యల పరిష్కారానికి భీమ్ ఆర్మీ తరఫున నిరంతరం అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని తెలిపారు.