భూమి కోసం.. సమానత్వం కోసం పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ
ప్రజాసంక్షేమం న్యూస్ ,సెప్టెంబర్ 26: భూమి కోసం, సమానత్వం కోసం పోరాటం చేసిన వీరవనిత చాకలి ఐలమ్మ అని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జునసాగర్ రోడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ్‌ముఖ్‌లకు ఎదురొడ్డి.. పేదల భూమి కోసం పోరాటం:ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 1895లో వరంగల్ జిల్లా కిష్టాపురంలో జన్మించిన చాకలి ఐలమ్మ పేదల భూమి కోసం ఎనలేని పోరాటం...