భూ సమస్యల పరిష్కారానికి రీసర్వే ఏకైక మార్గం:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
తొలి దశలో ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాల్లో సర్వే నక్షాలు లేని 413 గ్రామాల్లోనూ దశలవారీగా సమగ్ర భూసర్వే వనపర్తి, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): రాష్ట్రంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు భూసర్వే ఒక్కటే మార్గమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్,సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో ప్రజల కోణంలో ఆలోచిస్తూ భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు.వనపర్తిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రెవెన్యూ,రిజిస్ట్రేషన్, హౌసింగ్ అంశాలపై సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రులు...