PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 7:04 am Posted by : domalapallygopi@gmail.com

మానవత్వమే మహోన్నతం: దివ్యాంగుడికి ఊతకర్రలు అందజేసిన అడ్వకేట్ కట్టెల శివకుమార్

ప్రజా సంక్షేమం న్యూస్ | నల్గొండ జిల్లా:
నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న ఓ దివ్యాంగుడిని చూసిన SC, ST విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్ కట్టెల శివకుమార్ స్పందించారు.
వెంటనే ఆయన ఆ దివ్యాంగుడికి అవసరమైన ఊతకర్రలను సొంత ఖర్చులతో కొనుగోలు చేసి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా అవసరంలో ఉన్నవారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.
మానవత్వంతో స్పందించి దివ్యాంగుడికి అవసరమైన సహాయం అందించిన అడ్వకేట్ కట్టెల శివకుమార్‌ను పలువురు అభినందించారు.

Copyright © 2026 PRAJA SANKSHEMAM NEWS. All rights reserved.