మిర్యాలగూడలో నూతన కోర్టు భవనాలకు ఆరు ఎకరాల స్థలం కేటాయించాలి.

ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డికి బార్ అసోసియేషన్ వినతి మిర్యాలగూడ, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): మిర్యాలగూడ పట్టణంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి ఆరు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. పట్టణంలోని ఎస్.వి. గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీకి వినతిపత్రం అందజేశారు.ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం భవిష్యత్ అవసరాలకు సరిపోవడం లేదని బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. నూతన కోర్టు భవన...