మిర్యాలగూడ కోర్టుకు 6 ఎకరాల స్థలం కేటాయించాలి:మిర్యాలగూడ బార్ అసోసియేషన్
DROను కోరిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆధునిక కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని వినతి.. ప్రజాసంక్షేమం న్యూస్–నల్లగొండ,సెప్టెంబర్ 24: మిర్యాలగూడ పట్టణంలో నూతన కోర్టు భవనాల నిర్మాణానికి ఆరు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరుతూ మిర్యాలగూడ బార్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఆర్.దశరథ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు.ప్రస్తుతం ఉన్న కోర్టు భవనం పెరుగుతున్న వ్యాజ్యాల సంఖ్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరిపోవడం లేదని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు వెంకటేశ్వర్లు తెలిపారు.న్యాయవాదులు,కక్షిదారులు,కోర్టుకు వచ్చే ప్రజలకు అవసరమైన...