ప్రజాసంక్షేమం న్యూస్:
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్ఛం అందించారు .ఈ సమావేశంలో ఇటీవలి అమెరికా పర్యటన విశేషాలను ముఖ్యమంత్రి గారికి వివరించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో మన తెలుగు ఎన్నారైలు, కాంగ్రెస్ నాయకులతో జరిపిన సమావేశాలు,చర్చల గురించి తెలియజేశారు. మన ప్రజా ప్రభుత్వ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి ఎన్నారై సోదరులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారని సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది .అలాగే విదేశాల్లో కాంగ్రెస్ సిద్ధాంతాలను వ్యాప్తి చేయడంలో, తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ (IOC) పోషిస్తున్న కీలక పాత్రను వివరించాను. ఎన్నారైల సమస్యల పరిష్కారం, విదేశాల్లో పార్టీ బలోపేతానికి IOC చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై సీఎం గారితో వివరంగా చర్చించినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.