యక్షగాన కళాకారుడు గడ్డం రామనర్సయ్య మృతి పట్ల సిపిఎం సంతాపం!
కుటుంబానికి ₹5 వేల ఆర్థిక సాయం.. 50 కిలోల బియ్యం అందజేత ప్రజాసంక్షేమం న్యూస్ ఆత్మకూరు, సెప్టెంబర్ 20: ఆత్మకూరు మండలం కూరెళ్ల గ్రామానికి చెందిన ప్రముఖ యక్షగాన కళాకారుడు గడ్డం రామనర్సయ్య అకాల మృతి పట్ల సిపిఎం గ్రామ శాఖ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన భౌతికకాయానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా మృతుని కుమారుడు గడ్డం పాండురంగానికి సిపిఎం గ్రామ శాఖ తరఫున రూ.5,000 ఆర్థిక సాయం...