రామన్నపేట–పల్లెపహాడ్ రహదారి దుస్థితిపై సీపీఎం వినూత్న నిరసన
గుంతల్లో నిలిచిన నీటిలో కూర్చొని నిరసన.. సమస్య పరిష్కరించకపోతే కలెక్టరేట్ ముట్టడి:సీపీఎం నాయకులు ప్రజాసంక్షేమం న్యూస్-రామన్నపేట: రామన్నపేట నుంచి పల్లెపహాడ్ వరకు రహదారి పూర్తిగా ధ్వంసమై, అడుగడుగునా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక గ్రామంలో ప్రజలతో కలిసి ఆందోళన నిర్వహించారు.రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో దుబ్బాక, మునిపంపుల గ్రామాల సర్పంచులు గట్టు నర్సింహా, బొడ్డుపల్లి వెంకటేశం గుంతల్లో నిలిచిన నీటిలో కూర్చొని వినూత్నంగా నిరసన...