PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 6:50 pm Posted by : Praja Sankshemam News

రామన్నపేట BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రజా సంక్షేమం న్యూస్ | రామన్నపేట, సెప్టెంబర్ 25:
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *‘సేవా సంకల్ప్ అభియాన్’* లో భాగంగా రామన్నపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమం బీజేవైఎం నల్గొండ జిల్లా యువ నాయకులు అక్కేనపల్లి సైదులు ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణలో ఈ అభియాన్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.శిబిరంలో యువతతో పాటు పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు తమ వంతు సహకారం అందించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షులు కంబాలపల్లి సతీష్ యాదవ్, బీజేపీ నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులు మైల నరసింహ తదితరులు హాజరయ్యారు.
అలాగే ఏల్ల సంజీవరెడ్డి, జయరపు రామకృష్ణ, కన్నెగంటి వెంకటేశ్వరాచారి,పల్లపు దుర్గయ్య, జంగిలి సత్యనారాయణ, భాత్క నరేష్, రేపాక లింగుస్వామి తదితర బీజేపీ నాయకులు,సీనియర్ నాయకులు,బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసిన రక్తదాతలు, యువత, మహిళలు, నాయకులు మరియు కార్యకర్తలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.