రామన్నపేట BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
ప్రజా సంక్షేమం న్యూస్ | రామన్నపేట, సెప్టెంబర్ 25: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న *‘సేవా సంకల్ప్ అభియాన్’* లో భాగంగా రామన్నపేట మండల కేంద్రంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమం బీజేవైఎం నల్గొండ జిల్లా యువ నాయకులు అక్కేనపల్లి సైదులు ఆధ్వర్యంలో జరిగింది. తెలంగాణలో ఈ అభియాన్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది.శిబిరంలో యువతతో పాటు పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు....