రాష్ట్రంలో ఎవరి పట్ల వివక్ష లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాప్రభుత్వం మాది :ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

ప్రజాసంక్షేమం న్యూస్ -నకిరేకల్ రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో ఎవరి పట్ల వివక్ష లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ప్రజా పాలన పేదలు, రైతులు,మహిళలు,నిరుద్యోగుల కోసం పని చేస్తోందని పునరుద్ఘాటించారు.నల్గొండ జిల్లా నకిరేకల్‌లో రూ. 32 కోట్లతో నిర్మించిన 100 పడకల నూతన ప్రాంతీయ ఆసుపత్రిని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నకిరేకల్ రాజీవ్ గాంధీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వెయ్యి రోజుల ప్రజా...