రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం!
సర్కారు నిర్ణయాలపై ఉద్యోగుల్లో ఉత్కంఠ... ప్రజాసంక్షేమం న్యూస్: ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో 18న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆధ్వర్యంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ బుధవారం ఆయా సంఘాల అధ్యక్షులు,సెక్రటరీలకు లేఖ రాసింది. సచివాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు.ఈ నెల 9న జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.అందులో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి దీర్ఘకాల సమస్యలపై చర్చ జరగనుంది.పీఆర్‌సీ నివేదిక...