రైతులకు రూ.813 కోట్ల పరిహారం వెంటనే చెల్లించాలి: ఉత్తమ్ కుమార్ రెడ్డి
భూసేకరణ పరిహారం పంపిణీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి.. కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలి: మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి.. సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.6 వేల కోట్ల నిధులు.. ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:భూసేకరణ,పునరావాసం–పునరావాస పునరుద్ధరణ (R&R) కింద ఇప్పటికే విడుదలైన నిధులు భూములు కోల్పోయిన రైతులకు ఆలస్యం లేకుండా చేరేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల,పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు.ప్రభుత్వ ఖాతాల్లో నిధులు నిలిచిపోకుండా,పరిహారం చెల్లింపులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. జిల్లా కలెక్టర్లు,నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూసేకరణ,పరిహారం...