రోడ్డు గుంతలను వెంటనే పూడ్చాలని ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేత: సీపీఎం సర్పంచుల వినూత్న నిరసన
(ప్రజా సంక్షేమం న్యూస్-రామన్నపేట): దుబ్బాక - మునిపంపుల గ్రామాల మధ్య రోడ్డు అస్తవ్యస్తంగా తయారై,ప్రమాదకరంగా మారిన గుంతలను వెంటనే పూడ్చి ప్రజల రవాణా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఎం సర్పంచులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు.సమస్యపై పలుమార్లు విన్నవించేందుకు వెళ్లినా రోడ్లు & భవనాల (R&B) శాఖ అధికారులు అందుబాటులో ఉండకపోవడం, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం R&B కార్యాలయానికి వచ్చిన మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం,దుబ్బాక సర్పంచ్ గట్టు నర్సింహ అధికారులు ఎవరూ లేకపోవడంతో...