వర్షాభావ పరిస్థితులపై కేంద్ర సహకారం కోరిన సీఎం:

ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహం! మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి! కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు వినతిపత్రాన్ని అందజేతా... ప్రజా సంక్షేమం న్యూస్-హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు.దక్షిణ రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు,వ్యవసాయ రంగంపై వాటి...