విజయానికి అభిరుచి,కష్టపడి పనిచేయడం,క్రమశిక్షణే కీలకం: మంత్రి అజారుద్దీన్
హైదరాబాద్ లో నూతన మైనారిటీ స్టడీ సర్కిల్,కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రారంభం.. ప్రజాసంక్షేమం న్యూస్ -హైదరాబాద్ మైనారిటీ విద్యార్థులు,యువతకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న విద్యా,ఉద్యోగ,కెరీర్ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభిరుచి, కష్టపడి పనిచేయడం,క్రమశిక్షణ, పట్టుదలతో విజయాన్ని సాధించాలని మైనారిటీస్ వెల్ఫేర్,పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మైనారిటీ స్టడీ సర్కిల్, కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్‌ను మంత్రి అజారుద్దీన్ ప్రారంభించారు.విద్య,పోటీ పరీక్షలకు సన్నద్ధత, కెరీర్ మార్గదర్శకత్వం ద్వారా మైనారిటీ యువతను సాధికారత దిశగా...