విద్యార్థుల యూనిఫామ్‌లకు ఆకర్షణీయ రంగులు,వైవిధ్యమైన డిజైన్లు: సీఎం రేవంత్‌రెడ్డి
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే యూనిఫామ్‌లు, ఇతర సామగ్రి అందేలా ప్రణాళిక: విద్యార్థుల సంఖ్య 10 శాతం పెరిగే అవకాశం దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు,వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు అందించే యూనిఫామ్‌లలో మరింత ఆకర్షణీయమైన రంగులు, విభిన్న డిజైన్లను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.విద్యార్థులకు యూనిఫామ్‌లు,ఇతర సామగ్రి పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు.ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు,ప్రభుత్వ వసతి గృహాలు,రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఒక జత యూనిఫామ్‌ల పంపిణీ పూర్తయిందని...