వినాయక ఉత్సవాలను శాంతియుతంగా ఘనంగా నిర్వహించుకోవాలి:కలెక్టర్ బి. చంద్రశేఖర్

ప్రజాసమక్షేమం న్యూస్: ఈ సంవత్సరపు వినాయక ఉత్సవాలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ కలిసిమెలిసి ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు.బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గతంలో అన్ని రకాల ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవడం జరిగిందని, అదే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని కోరారు.