వి.ఆర్‌.విద్యార్థి వంటి కవులు,రచయితలు కాళోజీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాలి:మంత్రి జూపల్లి

రవీంద్రభారతిలో ఘనంగా కాళోజీ జయంతి ఉత్సవాలు: వి.ఆర్‌.విద్యార్థికి (వేలూరి రాములు)కాళోజీ సాహిత్య పురస్కార ప్రదానం: ప్రజాసంక్షేమం న్యూస్: కాళోజీ నారాయణరావు ప్రజల గొంతుకగా, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా సైనిక కవిగా, ఖండాంతర కవిగా ప్రసిద్ధి చెందిన వి.ఆర్‌. విద్యార్థికి (వేలూరి రాములు) 2026 కాళోజీ నారాయణరావు సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. వి.ఆర్‌. విద్యార్థిని మంత్రి జూపల్లి కృష్ణారావు...