మునుగోడు,సెప్టెంబర్ 30:ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి
తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన ఉద్యమ నిరుద్యోగ కళాకారులకు సాంస్కృతిక సారథిలో వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో చేపట్టనున్న రవీంద్ర భారతి ముట్టడి కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఉద్యమ కళాకారులు బయలుదేరారు.రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న ఆధ్వర్యంలో మునుగోడు మండలం నుంచి కళాకారులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.ఈ కార్యక్రమంలో ఉద్యమ కళాకారులు రడం నర్సింగ్‌రావు, రాములు, సైదులు, శంకర్, యాదయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.