ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రజాప్రతినిధులు:
వేములవాడ, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్):
పవిత్ర పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్‌లు వేముల వీరేశం, ఆది శ్రీనివాస్, చింతకుంట విజయ రమణారావు స్వామివారిని దర్శించుకున్నారు.
స్వామివారి దర్శనం అనంతరం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.
మీడియాతో మాట్లాడిన మంత్రి, ప్రభుత్వ విప్‌లు:దర్శనం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు ప్రభుత్వ విప్‌లు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై వారు వివరాలు వెల్లడించారు.