సెంట్రల్ హాల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి..
దుద్దిళ్ల శ్రీపాద రావు సెంట్రల్ హాల్‌గా నామకరణం…
ప్రజాసంక్షేమం న్యూస్:
శాసనసభ ప్రాంగణంలో నూతనంగా రూపుదిద్దుకున్న సెంట్రల్ హాల్‌ను సభా నాయకుడు, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు గారి పేరుతో సెంట్రల్ హాల్‌గా నామకరణం చేసిన ఈ ప్రాంగణ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి గారితో పాటు శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో పాటు మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.మాజీ శాసనసభ స్పీకర్ శ్రీపాద రావు గారి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి గారు గౌరవ సభ్యులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.