PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 8:00 pm Posted by : Praja Sankshemam News

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సంఘీభావం ప్రకటించిన టీడబ్ల్యూజేఎఫ్​,హెచ్​యూజే ప్రతినిధులు..

ప్రజాసంక్షేమం న్యూస్
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను టీడబ్ల్యూజేఎఫ్​,హెచ్​యూజే ప్రతినిధులు కలిసి సంఘీభావం ప్రకటించడంజరిగింది.ఈ సందర్బంగాటీడబ్ల్యూజేఎఫ్ నేతలు మీడియాను లాబీల్లోకి రానివ్వొద్దనే ప్రచారం జరుగుతుందని స్పీకర్ దృష్టికి తీసుకుపోయినారు.
మీడియాకు ఎదురవుతున్న సమస్యలనూ ఆయనకు వివరించిన ప్రతినిధులు.లాబీల్లో మీడియాకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేశారు.ఈ సందర్బంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఉంటుందని ఫెడరేషన్ నేతలకు స్పీకర్ హామీ ఇచ్చారు .చిన్నచిన్న సమస్యలనూ కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.