శ్రీరామనవమి నాటికి భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు పూర్తి!
వర్షంలోనూ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.300 కోట్లకు పైగా నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి పనులు పనుల్లో జాప్యం వద్దని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ప్రజాసంక్షేమం న్యూస్-భద్రాచలం:వచ్చే ఏడాది శ్రీరామనవమి నాటికి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన ప్రాకారాలు, మాడ వీధుల పునర్నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణం,సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను, సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యేలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ,కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్,డీసీసీ...