PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 10:34 pm Posted by : Praja Sankshemam News

సభాధ్యక్ష స్థానంలో శాసనసభను నడిపించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

ప్రజాసంక్షేమం న్యూస్ -హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే,మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారు ప్యానల్ స్పీకర్ హోదాలో సభాధ్యక్ష స్థానంలో ఆసీనులై సభను నడిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.​సభ సమర్థవంతంగా సాగేందుకు ప్యానల్ స్పీకర్ గా స్పీకర్ స్థానంలో అనుభవజ్ఞుడైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు కూర్చున్నారు.అనంతరం సభలో వివిధ ప్రజాసమస్యలపై జరిగిన చర్చలను ఆయనకు ఉన్న అనుభవంతో చాకచక్యంగా నిర్వహించారు.సభా నియమావళికి కట్టుబడి,ప్రతిపక్ష,అధికార పక్ష సభ్యులకు తగిన సమయాన్ని ఇస్తూ సభను ఎంతో గౌరవప్రదంగా నడిపించారు.ఈ సందర్బంగా మంత్రి దామోదర రాజనర్సింహా గారు బిఆర్ఎస్ నాయకులు తాత మధు,నవీన్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,బిఆర్ఎస్ నాయకుల ప్రవర్తనకు బాధ్యత తీసుకొని కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని ఏకగ్రీవంగా అమోదించారు.​మాజీ మంత్రిగా,ఉప ముఖ్యమంత్రిగా,ఎంపీగా ఎన్నో ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పరిజ్ఞానం కలిగిన కడియం శ్రీహరి గారు సభాధ్యక్ష హోదాలో చూపిన సామర్థ్యం,క్రమశిక్షణ ఆయన పార్లమెంటరీ అనుభవానికి అద్దం పట్టాయి.స్పీకర్ స్థానంలో ఆయన సభను నిర్వహించిన తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,మంత్రులు,పలువురు ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా అభినందించారు..