సరంపేటలో రూ.2.15 కోట్లతో 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చేతుల మీదుగా శంకుస్థాపన మర్రిగూడ, సెప్టెంబర్ 29: ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి: మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలో రూ.2.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. విద్యుత్ సమస్యలకు పరిష్కారం;సబ్‌స్టేషన్ నిర్మాణంతో సరంపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉంది. విద్యుత్ అంతరాయాలు, వోల్టేజ్ సమస్యలు తగ్గి రైతులు,...