PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 10:50 pm Posted by : Praja Sankshemam News

సిరిసిల్ల సిద్దిపేట పై దండయాత్ర చేస్తాం: రేవంత్ రెడ్డి

ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ:
నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు పర్యటించారు.ఈ పర్యటనలో రూ.345 కోట్లతో 12 అభివృద్ధి పనుల శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.నకిరేకల్‌లో 100 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు.ఈ ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీలు రఘువీర్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు మీ బతుకులు ఇక చీకటిమయమే తెలంగాణ తులసివనంలో గంజాయి మొక్కలను పీకేస్తాం నెక్స్ట్ టార్గెట్ సిరిసిల్లనే ఈ నెలాఖరుకు కాంగ్రెస్ సైన్యంతో వచ్చి సిరిసిల్ల గడ్డపై మూడు రంగుల జెండా ఎగరేస్తా! ఆ తర్వాత సిద్దిపేట పై దండా యాత్ర చేస్తాం భవబామర్థుల్లారా!బంధువులను, చెంచాలను,చెప్పులు మోసేళ్ళని ఎవరినితెచ్చుకుంటారో తెచ్చుకోండి అని ఛాలెంజ్ విసిరారు.రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగితే 117 సీట్లలో గెలుస్తామని,సీట్లు పెరగకపోతే 97 సీట్లతో కాంగ్రెస్ గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) ధీమా వ్యక్తం చేశారు.2024 నుంచి 2034 వరకు పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.ఇదే బీఆర్ఎస్,బీజేపీలకు తన సవాల్ అని పేర్కొన్నారు.బీఆర్ఎస్ అనే మొక్కను ఏ ఎన్నికల్లోనూ తాను మొలవనివ్వనని హెచ్చరించారు.