సిరిసిల్ల సిద్దిపేట పై దండయాత్ర చేస్తాం: రేవంత్ రెడ్డి
ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు పర్యటించారు.ఈ పర్యటనలో రూ.345 కోట్లతో 12 అభివృద్ధి పనుల శిలాఫలకాలను సీఎం ఆవిష్కరించారు.నకిరేకల్‌లో 100 పడకల ప్రభుత్వాస్పత్రిని ప్రారంభించారు.ఈ ఆస్పత్రిలో పలు విభాగాలను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,ఎంపీలు రఘువీర్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి,టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు.అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ బిఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు...