PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 6:19 pm Posted by : Praja Sankshemam News

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి..

టీపీసీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. ఎన్నికల కమిషన్‌కు వినతిపత్రం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్):

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్నికల కమిషన్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ఎన్నికల కమిషన్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి,అనిల్ కుమార్ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు, అధ్యక్షులు,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.