PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 5:52 pm Posted by : Praja Sankshemam News

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు

సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డికి సీఎం అభినందనలు
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఖరారైన సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఇరువురు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులుగా అవకాశం లభించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన విషయం తెలిసిందే.