PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 12:48 pm Posted by : Praja Sankshemam News

సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. ఏర్పాట్లపై కీలక సమీక్ష:

ప్రజాసంక్షేమం న్యూస్:
సెప్టెంబర్ 19న కోదాడలో నిర్వహించనున్న జాబ్ మేళా ఏర్పాట్లపై పౌరసరఫరాలు,నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు,ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు పాల్గొని జాబ్ మేళా ఏర్పాట్లు,నిరుద్యోగ యువతకు అందుబాటులోకి తీసుకురానున్న ఉద్యోగ అవకాశాలు,కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.