సెప్టెంబర్‌ 5న 123 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డులు..

ప్రజా సంక్షేమం న్యూస్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులు-2026కు సంబంధించి కీలక ప్రకటన చేసింది.రాష్ట్రవ్యాప్తంగా వివిధ విద్యా విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన 123 మంది ఉపాధ్యాయులు,అధ్యాపకులను రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసినట్లు ప్రకటించింది.ఈ మేరకు విద్యాశాఖ గురువారం జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో వివరాలను వెల్లడించింది.రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా సెప్టెంబర్‌ 5న ఎంపికైన అవార్డు గ్రహీతలకు పురస్కారాలు అందజేయనున్నారు.పాఠశాల విద్య,ఇంటర్మీడియట్‌,సాంకేతిక విద్య, విశ్వవిద్యాలయాలు,అనుబంధ కళాశాలలకు చెందిన వారిని ఈ అవార్డులకు ఎంపిక చేశారు.మొత్తం 123 మంది అవార్డు...