హైదరాబాద్‌ను గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతాం.సిఎస్
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ‘స్టోరీస్,గేమ్స్&డ్రీమ్స్’థీమ్‌తో యువతకు ఆకర్షణీయ కార్యక్రమాలు... సుమారు 50 వేల మంది సందర్శకులకు అవకాశం:సీఎస్ సంజయ్ జాజు హైదరాబాద్, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గేమింగ్, వీఎఫ్‌ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రముఖ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.డిసెంబర్‌లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై...