హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు:
తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం:ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఔత్సాహికుల కోసం ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులను డిసెంబర్ నుంచి అందించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన పేర్కొన్నారు.ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడు కరణ్ బిలిమోరియా, బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక...