హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి: ముఖ్యమంత్రి

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి,అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ,పర్యాటక అభివృద్ధి, ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీపై అధికారులతో సమీక్ష! ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేసే దిశగా పలు కీలక అంశాలపై నిన్న రాత్రి అధికారులతో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి,అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ,టెంపుల్ మరియు ఫారెస్ట్ టూరిజం అభివృద్ధి,వరంగల్ ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీ,బస్ టెర్మినల్,ఔటర్ రింగ్ రోడ్డు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు....