హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష:

ప్రజాసంక్షేమం న్యూస్ - హైదరాబాద్ హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవాలు ముగిసే వరకు మున్సిపల్,పోలీస్ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.గణేశ్ ఉత్సవాలు పర్యవేక్షణ,సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు.శాసనసభ ఆవరణలోని మండలి సమావేశ మందిరంలో హైదరాబాద్ మహానగరంలో గణేశ్ ఉత్సవ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు,మహమ్మద్ అజారుద్దీన్ గారు,ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారు,నగర ప్రజాప్రతినిధులు, జీహెచ్ఎంసీ,సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ), మల్కాజిగిరి...