బీసీ విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక భరోస…
డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ..
సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క!
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్):
బీసీ విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విడుదల, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అధికారులతో సమీక్షించారు.ప్రీమెట్రిక్, పోస్ట్‌మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి ఇప్పటివరకు 1.30 లక్షల మంది విద్యార్థులకు రూ.450 కోట్ల నిధులను డీబీటీ విధానం ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.విద్యార్థులకు అందాల్సిన ఆర్థిక సహాయం సకాలంలో, పారదర్శకంగా వారి ఖాతాల్లోకి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌లతో పాటు విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన ఇతర ప్రయోజనాల అమలులోనూ జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.బీసీ విద్యార్థులు ఉన్నతంగా చదివి జీవితంలో ఎదిగేందుకు అవసరమైన అవకాశాలు, ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రభుత్వం ముందుంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.